కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా మారారని మండిపడ్డారు. 8 నెలల్లో సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిచేసిందా అంటూ నిలదీశారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీపడి పర్యటనలు చేస్తున్నారని… తాము ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొంటుందని తెలిపారు. తాము చేసిన ప్రతి పనిని ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటుందని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు అని.. ఖమ్మం జిల్లాకు కరవు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు కోసం సంకల్పం చేసింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.