రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణలో ప్రత్యేకంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త అంగన్ వాడి సెంటర్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్లకు కొత్త ట్యాబ్ లు ఇవ్వాలని కోరారు. అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సీరీ క్లాస్ లను ప్రారంభిస్తున్నామన్న మంత్రి సీతక్క. కేంద్రం నుంచి మరింత సహాకారం అవసరం అని తెలిపారు. రిటైర్ అవుతున్న అంగన్ వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు.


