ప్రధాని నరేంద్ర మోదీ కేరళ చేరుకున్నారు. వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఆయన కన్నూర్ చేరుకున్నారు. కాసేపట్లో వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్ చేరుకుంటారు. సహాయక చర్యలను సమీక్షించేందుకు వయనాడ్ వెళ్తున్నారు. కేరళ ప్రభుత్వంతో మోదీ సమీక్షించనున్నారు. వయనాడ్ కు 2వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేరళ డిమాండ్ చేస్తోంది. కొండచరియలు విరిగిపడి దాదాపు 400 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది ఆచూకీ లభించలేదు.


