ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ పేరు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం 23 వేల కోట్లుకు పెంచి దోపిడీ చేసిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆనాటి నుంచి కాంగ్రెస్ ఖండిస్తూ వస్తోందన్నారు. 8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల సమక్షంలో రివ్యూ చేశామన్నారు. తక్కువ ఖర్చుతో నీళ్ళు పారించే విధానంతో అతి తక్కువ ఖర్చుతో కేవలం 75 కోట్లతో లక్షన్నర ఎకరాలు పండించేలా సీతారామ ప్రాజెక్ట్ లింకు కెనాల్‌తో పనులు చేశామన్నారు. ఎన్‌ఎస్‌పీ లింకు, వైరా కెనాల్‌కు లింకు కలపటమే రేపటి కార్యక్రమమని… ఇదీ మా నిబద్ధతకు తార్కాణం అని భట్టి విక్రమార్క తెలిపారు.


