లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. కొద్దిసేపు అక్కడే గడిపి.. రామ్‌చెట్ చెప్పులు, షూలు కుట్టడం చూసిన రాహుల్ నేర్చుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ చెప్పులు కుట్టారు. ఆ తర్వాతి రోజు రామ్‌చెట్‌కు షూలు కుట్టే ఎలక్ట్రిక్ మెషిన్‌ను రాహుల్ పంపించారు. పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు సుల్తాన్‌పూర్‌కు రాహుల్ వెళ్తుండగా చెప్పులు కుట్టే రామ్ చెట్ దుకాణం దగ్గర ఆగారు. అతడితో మాట్లాడుతూ చెప్పు కుట్టేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. రాహుల్ పర్యటన తర్వాత తన జీవితం మారిపోయిందని చెప్పులు కుట్టే రామ్ తెలిపాడు.
తాజాగా రాహుల్ కుట్టిన చెప్పులకు భలే గిరాకీ పెరిగింది. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ప్రజలు తమ బైక్‌లు, కార్లు ఆపి తనను పిలుస్తున్నారన్నారు. అంతేకాకుండా గౌరవం కూడా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఒక కాలర్ 10 లక్షల వరకు రాహుల్ కుట్టిన చెప్పులు కొనేందుకు ఆఫర్ చేసినట్లు చెప్పాడు.
ఒక వ్యక్తి నగదుతో కూడిన బ్యాగ్‌లను అందించాడని.. కానీ తాను తిరస్కరించినట్లు రామ్‌చెట్ చెప్పాడు. తాను వాటిని విక్రయించనని చెప్పాడు. పనిచేస్తే గానీ పూటగడవని ఆ చెప్పులు కుట్టే వ్యక్తి.. ఒక జత చెప్పులను మాత్రం అస్సలు విక్రయించడం లేదు. పైగా వాటికి కోట్ల రూపాయలు ఇచ్చినా అమ్మనని తెగేసి చెబుతున్నాడు. వాటిని ఫ్రేమ్ కట్టించుకుని.. తన కళ్ల ముందే ఎప్పుడూ ఉంచుకుని కూర్చుంటానని తేల్చి చెప్పాడు.