డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఒక విజ్ఞప్తి చేశారు. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని.. ఒక కామన్ మెన్ గా ఫిర్యాదు చేస్తున్నానని.. బుద్ధా వెంకన్న చెప్పారు. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అని.. ఆయన తన కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారని బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లదని.. వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బుద్ధా వెంకన్న కోరారు. త్వరలో డీజీపీకి కూడా లేఖ రాస్తానని.. మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలావచ్చాయో దర్యాప్తు బృందాలు నిగ్గు తేల్చాలని బుద్దా వెంకన్న కోరారు.