25.1 C
Hyderabad
Wednesday, July 30, 2025
spot_img

ఆహాలో అలరిస్తున్న గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’

కమెడియన్  గెటప్ శ్రీను హీరో తెరకెక్కిన ‘రాజు యాదవ్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటిలోనూ అలరిస్తోంది.

ఎప్పుడు నవ్వుతూనే ఉండే లోపం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్టుతో యదార్థ సంఘటనల ఆధారంగా తెరికెక్కిన ‘రాజు యాదవ్’ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. తమిళం, మలయాళం సినిమాలలో కనిపించే సహజత్వంతో కూడుకున్న సన్నివేశాలతో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ సినిమాటిక్ పోకడలకి వెళ్ళకుండా చాలా రియలిస్టిక్ గా సినిమా ఉంది.

ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రం. ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది.

గెటప్ శ్రీను నటన చిత్రానికి ప్రధానబలం. ఫేస్ మీద ఎప్పుడు నవ్వుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు. ప్రథమార్థంలో నవ్వు మొహంతో కనిపిస్తూ నవ్వించిన ఆయన, ధ్వితీయార్థంలో నవ్వుతూనే భావోద్వేగాలని పండించాడు. దర్శకుడు కృష్ణమాచారి ఒక రియల్ స్టోరీని తీసుకొని, అంతే రియలిస్టిక్ గా చూపించాడు. సినిమాలో చివరి 20 నిమిషాలు వచ్చే సన్నివేశాల్ని, ఎమోషన్ ని మలిచిన తిరుకి దర్శకుడిని తప్పకుండ అభినందిచాల్సిందే.

తారాగణం: గెట్ అప్ శ్రీను, అంకిత కరత్, ఆనంద్ చక్రపాణి, మిర్చి హేమంత్

రచయిత, దర్శకుడు: కృష్ణమాచారి

నిర్మాతలు : ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి

సంగీతం: హర్ష వర్దన్ రామేశ్వర్, సురేశ్ బొబ్బిలి

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్