సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తోంది. ఏకంగా మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. ఈటీవీ విన్, ఆహాలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించింది. సుధీర్ బాబులోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ మూవీలో లక్కీ లక్ష్మణ్, రవి కాలే, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 14న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఓటీటీల్లో మాత్రం దూసుకెళ్తుండడం విశేషం.
తారాగణం: సుదీర్ బాబు, మాల్విక శర్మ, సునీల్
రచయిత, దర్శకుడు: గ్నానసాగర్ ద్వారక
నిర్మాత: సుమంత్ జి నాయుడు
సంగీతం: చైతన్ భరద్వాజ్
డిఓపీ: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
డిజిటల్ ఆక్విజిషన్ పార్ట్నర్: బిగ్ ఫిష్ సినిమాస్


