సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. కృష్ణ కుమారుడు రమేష్ బాబు వారసుడు జయకృష్ణ త్వరలో హీరోగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. జయకృష్ణ బర్త్ డే సందర్భంగా పద్మాలయ స్టూడియోలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఈ ప్రకటన చేశారు. ఆల్ ఇండియా కృష్ణా మహేష్ ప్రజా సేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. తెలుగు సినిమా రంగానికి త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సందర్భంగా జయకృష్ణ తొలిసారి అభిమానుల సమక్షంలో పుట్టినరోజును జరుపుకున్నారు. త్వరలోనే సినిమా మొదలవుతుందని, అభిమానులందరికి జయకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని కథలు విన్నామని, అందరం విని ఒక స్టోరీని ఓకే చేస్తామని, మంచి బ్యానర్‌లో మంచి సినిమాతోనే వస్తామని జయకృష్ణ తల్లి మృదుల చెప్పారు.