ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నక్యాంటీన్లను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందని అన్నారు. వాటి ఆధారంగా త్వరలోనే ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే మెరుగైన విధానంతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమల్లోకి తెస్తామని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.


