తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వైద్యులకు సూచించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని మాజీ ఎంపీ మురళీమోహన్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఆసుపత్రికి వచ్చేవారిలో ఎక్కువ మంది పేదవారే ఉంటారని.. వారికి ప్రభుత్వ ఆసుపత్రి మినహా ఏ ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లే స్తోమత ఉండదన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వస్తారని అటువంటి రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ఏ రోగిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారికి వచ్చిన వెంటనే సకాలంలో వైద్యం చేసి పంపించవలసిన బాధ్యత డాక్టర్లదే అని ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.


