జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో పవన్‌కల్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని, పిఠాపురంలోనే ఉంటానని బహిరంగసభలో ప్రజలకు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి16 లక్షల రూపాయలు ఉంది. మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.


