తెలంగాణలో వనరులున్నా పర్యాటకంగా అభివృద్ధి చెందలేదన్నారు మంత్రి జూపల్లి. పదేళ్లలో టూరిజం డిపార్ట్‌మెంట్ లేదని విమర్శించారు. అసలు టూరిజం పాలసీ కూడా లేదన్నారు. త్వరలో నే డ్రాప్ట్ పాలసీ పై సీఎంతో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర టూరిజం డిపార్ట్ మెంట్ కు ఎన్నో వనరులు ఉన్నాయన్న మంత్రి టూరిజం అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన జరుగు తుందని చెప్పుకొచ్చారు.