బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందని తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కరీం నగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లా లకు శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు నిన్న తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి భారీ వర్షం పడింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 9.12 సెంటీమీటర్ల వర్షం పడింది. భద్రాచలం, జూలూ రుపాడ్, చంద్రుగొండ, కొత్తగూడెం, అశ్వాపురం భారీ వర్షం పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, ఆది లాబాద్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది నైరుతి రుతపవానాలు జూన్ మెుదటి వారంలోనే వచ్చినా ఆశిచినంతగా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది జూన్ ముగిసేటప్పటికీ 159 మి.మీ. వర్షపాతం నమో దైంది.