మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్‌కు ముందు అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని తెలిపారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా బీఆర్ఎస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధం చేసిందన్నారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిం చిందని క్యాట్ చెప్పిందని మేడిగడ్డ డిజైన్ ఒకటైతే నిర్మాణం మరో రకంగా చేయడంతో కుంగిపో యిందని తెలిపారు.


