మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టేవే యడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను నరసరావుపేట SP ఆఫీసుకు తీసుకెళ్తున్నారు.
పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం కేసు సహా మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్న పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వయి గేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడారు.అలాగే పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారని, సీఐ టీపీ నారాయణస్వామి పై దాడిచేసి గాయపరిచారని, పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మా సనం ఇవాళ తీర్పు వెలువరించింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయ వాది ఎన్. అశ్వినికుమార్ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటే శ్వర్లు వాదనలు వినిపించారు.


