రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకు న్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, ధర్మ గుండంలో పుణ్య స్నానాలు ఆచరించి, కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.