అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో విష్ణు అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కార్తీక్ ,సత్య , మోహన్ అనే మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు ధర్మపురి నుండి హైదరా బాద్ కు బైక్ వెళ్తుండగా ప్రమాదం చోటుచే సుకుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలుడిని గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.