26.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

బ్యాంకుల తీరుపై ఆందోళనకు దిగిన రైతులు

      బడా బాబుల మొండి బకాయిలు దండిగా ఉన్నా పట్టించుకోని అధికారులు అప్పులతో సతమతం అవుతున్న పేద రైతులపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారు. జిల్లా సహకార బ్యాంకులు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వసూళ్ల విషయంలో ఫ్రైవేట్ ఫైనాన్స్ ల ను మించిపోయి ఆగడాలకు పాల్ప డుతున్నాయి. బ్యాంకుల తీరును నిరసి స్తూ కామారెడ్డిలో ఓ రైతు పొలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపాడు. మరోవైపు సహకార బ్యాంకుల తీరును నిరసిస్తూ రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.

సహకార బ్యాంకులు అంటేనే సమస్యలు, వివాదాలు గుర్తుకు వస్తాయి. ఇందుకు నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ఏమీ అతీతం కాదు. రుణాలు రికవరీ కాకపోవడంతో ఏకంగా 130 కోట్ల రూపాయల బకా యిలు పేరుకుపోయాయి. ఇదంతా నాణానికి ఒకవైపు కనిపిస్తున్న అంశం. అయితే నాణానికి రెండో వైపు చూస్తే, రుణాలు తీసుకున్న రైతులు కరువు పరిస్థితుల వల్ల అప్పుల్లో కూరుకు పోయారు. ఒకవైపు వడ్డీలు విపరీతంగాపెరిగిపోతూండడంతో, మరోవైపు అప్పు బకాయిలు చెల్లించాలని బ్యాంకులు రైతుల ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సుమారు 250 కోట్ల రూపాయల మేర అప్పులు మంజూరు చేసింది. అయితే, నిబంధనలకు తిలోదకాలిచ్చిన బ్యాంకు అధికారులు, అర్హులు, అనర్హులు అని చూడ కుండా ఇష్టానుసారం లోన్లు మంజూరు చేసేసింది. అయితే, రికవరీలో జాప్యం జరుగుతోంది. ఈ నెలాఖ రు లోపు బకాయిలు వసూలు చేయాలని బ్యాంక్ అధికారులు సిబ్బందికి టార్గెట్ విధించారు. దీంతో, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా దూకుడు ప్రదర్శిస్తు న్నారు. రుణగ్రహీతలపై ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల మాదిరిగా వేధింపులకు పాల్పడుతున్నారు. లింగంపేటలో ఓ రైతు పొలంలో ఎర్రజెండాలు పాతి, భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు పెట్టారు. బ్యాంకు సిబ్బంది తీరుకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బ్యాంకు అధికారులు గత రెండేళ్లుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. పాత బకాయిల వసూలు కోసం చేపట్టిన ఈ డ్రైవ్ లలో ఇప్పటికి 139 కోట్లు రూపాయలు వసూలు చేశారు. వడ్డీతో సహా ఇంకా 130 కోట్ల రూపాయలకు పైగా వసూలు కావాల్సి ఉంది. నాబార్డ్, టెస్కాబ్ తదితర సంస్థల నుంచి డిసిసిబి రుణాలు తీసుకొచ్చి ఖాతా దారులకు అందజేశారు. అయితే, బకాయిల కోసం ప్రత్యేక రాయితీ అవకాశం ఇచ్చిన కొందరు చెల్లిం పులు జరపలేదు. జూన్ చివరి వరకు వన్ టైం సెటిల్మెంట్ కు గడువు ఉంది. రుణమాఫీ వస్తే అప్పు తీరుతుందనే కారణాలతో చాలామంది సొమ్ము కట్టకుండా వేచి చూస్తున్నారు.

  సందిగ్ధావస్తలో ఉన్న రైతుల పరిస్థితిని గమనించకుండా, ఈ రైతులందరినీ బ్యాంకు మొండి బకాయి దారులుగా నిర్ణయించేసింది. ఇదేకాక, కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే, న్యాయపరంగా నోటీ సులు ఇచ్చి, ప్రకటనలు చేసి, నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఏ సమస్యా ఉండేది కాదు. అయితే, లింగంపేట ఘటనలో ఎర్రజెండాలు పాతి బ్యాంకు అధికారులు విచిత్రంగా ప్రవర్తించడంపై సర్వత్ర ఆశ్చ ర్యం వ్యక్తం అయ్యింది. ఈ ఉదాంతంపై బ్యాంకు అధికారుల తీరు విమర్శలకు దారి తీసింది.కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన బడాబాబుల జోలికి బ్యాంకు అధికారులు వెళ్లడం లేదు. సామా న్య రైతులపై దర్పం చూపుతూ, ఆ రైతన్నల పొలాల్లో నానా హంగామా చేస్తున్నారు. భూములు స్వాధీనం చేసేసుకుంటామని హెచ్చరికలు జారీ చేసి, వారి పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. లింగంపేట్ మండలం పోల్కం పేట్, పర్మల్ల, శెట్టిపల్లి గ్రామాలకు చెందిన 150 మంది రైతులు ఈ బ్యాంకు నుంచి రుణాలు తీసు కున్నారు. వీరికి అధికారులు తొలుత నోటీసులు ఇచ్చి ఇప్పుడీ చర్యలు చేపట్టారు. అధికారుల తీరు పై నిరసన తెలుపుతూ రైతులు బ్యాంకుల ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులపై కఠిన వైఖరి అవలం భిస్తే చూస్తూ ఊరుకోం అని విపక్షనేతలు బ్యాంకు అధికారులను హెచ్చరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్