తెలుగు జర్నలిజానికి ఆయనో అక్షర శిల్పి. ఈనాడు పేరుతో మూస పద్ధతికి స్వస్తి పలికిన అభ్యుదయ వాది. ఆ మేరకు జర్నలిజంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు మరువలేనివన్నారు సీనియర్ జర్నలిస్ట్ లు. సీనియర్ పాత్రికే యుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియో మొగల్ రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఈనాడులో సుధీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ పాత్రికేయులు రామోజీరావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుభవా లను పంచుకున్నారు.
రామోజీ రావు తెలుగు జర్నలిజంలో తీసుకువచ్చిన మార్పులు అనుపమానమైనవి,అనితర సాధ్యమైనవి పత్రికా రంగం పట్ల అంకిత భావంతో పనిచేసిన ఆయనకు తప్ప మరో సంపాదకుడికి అది సాధ్యపడలే దంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లా, తాలూకాల వార్తలు మాత్రమే చేరుకోగలిగే వార్తా పత్రికలను గ్రామీణా ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో జరిగే వార్తలను సైతం ప్రతి గడపకు తిసువెళ్లగలి గారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చారని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , సీనియర్ పాత్రికేయులు ఎం.నాగేశ్వర రావు అన్నారు. రామోజీ రావుతో కలసి 38 ఏళ్ళు ప్రయాణం చేసే అవకాశం దొరికిందని, ఆయనో విశిష్ట గుణాల మేలు కలయికన్నారు. తెలుగు పత్రికకు ఎనలేని ఖ్యాతిని రామోజీ రావు తీసుకువచ్చారని, కఠినమైన క్రమశిక్షణ ఆయన మొదటి లక్షణంగాపాటించేవారని ఎం. నాగేశ్వర్ రావు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
రామోజీ రావు మీద ఇటీవల ఒక ప్రభుత్వం కక్ష కట్టినా ఆయన వ్యాపారాలను కుప్పకూల్చాలని ప్రయత్నా లు చేసినా చెక్కు చెదరకపోవడానికి కారణం ప్రజలల్లో ఆయన సంపాదించుకున్న విశ్వసనీ యతే కారణమని సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ అన్నారు. రామోజీ రావుకు అపారమైన అవకాశాలు ఉన్నా రాజకీయాలకు వెళ్ళలేదని, ఆయనలోనూ తప్పులు ఉండొచ్చు కానీ వాటికి మించిన ఒప్పులు ఎక్కువగా ఉన్నాయని కొనియాడారు. రామోజీరావు ఒక మీడియా రంగంలోనే కాక వ్యాపారరంగంలో కూడా ఆయన క్రెడిబులీటి గొప్పదని, ఎన్టీఆర్, టంగుటూరి మాదిరి ఒక చారిత్రక పురుషుడిగా కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకుంటారని.. ఒక ఎవరెస్ట్ పర్వతం మాదిరి ఎదిగిన వ్యక్తి రామోజీ రావు అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ మాట్లడుతూ, రామోజీరావు ఆయనకు ఉన్న ఇతర వ్యాపారాల కన్నా ఈనాడు పత్రికకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, తెలుగు పత్రికా రంగాన్ని ఒక రకంగా రామోజీరావు ముందుండి నడిపారాని అన్నారు. ప్రస్తుతం పత్రికల యాజమాన్యాలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఆయన పట్టుదలతో ఈనాడు పత్రికను పత్రికారంగంలోనే ఒక బ్రాండ్ గా మార్చారని గుర్తు చేశారు. అంతేకాక రామోజీ రావు సంతాప సభకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హజరై.. ఈనాడు ఉద్యోగులతో రామోజీరావు ఏ విధంగా ఉండేవారో గుర్తు చేసుకున్నారు. కంట్రిబూటర్స్, రిపోర్టర్లు రాసిన వార్తలలొ పొరపాట్లను గుర్తించి, సరిచేయడంతోపాటు మంచిని అభినందించేవారన్నారు. ప్రస్తుతం తాను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానంటే అందుకు కారణం ఈనాడు నేర్పిన క్రమశిక్షణ అని, ఇప్పటికీ తనను ఈనాడు అప్పలనాయుడు అంటారని ఎంపీ అప్పల నాయుడు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈనాడు పత్రికలో రామోజీరావు పేరుతో 25 ఏళ్ళుగా ఆర్టికల్స్ రాసే అవకాశం రావడం చివరకు ఆయన చనిపోయిన తర్వత కూడా ఉద్యోగులు ఎలా పని చేయాలో రాసిన వీలునామా రాశానని సీనియర్ పాత్రికే యులు మూర్తి గుర్తు చేసుకున్నారు. జర్నలిజం స్కూల్ ద్వారా ఎంతో మంది జర్నలిస్ట్ లకు జన్మ్నిచ్చా రని, రామోజీరావు పేరిట జాతీయ స్థాయిలో జర్నలిస్ట్ అవార్డు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. రామోజీరావుకు అక్షరాంజలీ సంతాప సభకు హజరైన పాత్రికేయులు రామోజీరావుతో ఉన్న అనుభవాలను పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు. రామోజీ రావు నిత్యం తమకు సలహలు సుచన లు ఇస్తున్నట్లే భావిస్తూ, ముందుకు సాగుతామని అన్నారు. తెలుగు జర్నలిజంలో ఆయన తీసుకువచ్చిన మార్పులు చిరస్మరణీయం అన్నారు.