ప్రజా దర్బార్‌లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. కార్యక్రమాన్ని ప్రారంభిం చిన మంత్రి.. రెండో రోజూ కూడా ప్రజా దర్బార్‌ను మంత్రి నారా లోకేష్ నిర్వహిం చారు. మంత్రి నారా లోకేష్‌ను కలిసి ప్రజలు సమస్యలను విన్నవించుకున్నారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తు న్న 2 వేల 193 మందిని రెగ్యులర్ చేయాలని లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ కోరింది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించా లని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారిం చాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.


