కాంగ్రెస్‌లో ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా నేడు తనను గుర్తించడం లేదని మాజీ ఎంపీ వీ. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసం వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక నేతలు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. సోనియాగాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను నేడు సీఎం రేవంత్ అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగు బలహీనవర్గాల సమన్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. ఇందిరాగాంధీ కోరిన విధంగా పేద ప్రజలకు ఇళ్లను కేటాయించా లని, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు.


