ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. 12 పేజీలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాశారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మైన మార్పులు చూపించామని,రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించామని లేఖలో కేసీఆర్ చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఛైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించిందన్న కేసీఆర్ కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కోరారు.


