సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలను కాంగ్రెస్ స్వాగతిస్తోందని అన్నారు ఆ పార్టీ నేత తులసీరెడ్డి. ఉపాధ్యాయ పోస్టులతో సహా 2లక్షల 50వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం 16వేల 347 రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నిర్వహాణకు సంతకం చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంకా 2లక్షల 34వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక పించన్లను నెలకు 4వేలకు పెంచుతూ సంతకం చేయడం హర్షణీయమని తెలిపారు.