29.4 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

ఏపీ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన నేతలు

ఏపీలో అత్యంత వైభవంగా, అట్టహాసంగా ప్రమాణోత్సవం సాగింది. కూటమి సర్కార్‌ కొలువుదీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతోపాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతఃకరణశుద్ధితో నిర్వర్తిస్తామంటూ ప్రమాణం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతోపాటు, సినీ ప్రముఖులు తరలి రావడంతో సందడి వాతారవణం నెలకొంది. కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సాహం మధ్య ప్రమాణ పండుగ సాగింది.

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేత కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని వర్గాల ప్రజలతో సన్నిహి తుడిగా, సౌమ్యుడిగా మంచి గుర్తింపు ఉండటంతో బీసీ సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్రకు మంత్రిగా అవకాశం దక్కింది.

జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన మనోహర్.. మూడో స్థానానికి పరిమితమగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు.

మరోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ నేత నారాయణ. జగన్‌ అధికారానికి కంటే ముందు ఏర్పడిన గత టీడీసీ సర్కార్‌ హయాంలోనూ నారాయణ మున్సిపల్‌శాఖ మంత్రిగా వ్యవహరిం చారు. ఈసారి మళ్లీ తెలుగు దేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం, ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొం దడంతో మరోసారి రాష్ట్ర మంత్రి పదవి వరిం చింది.

ఏపీలో కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కురాలైన వంగలపూడి అనితకు మంత్రి గా అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమెకు చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కింది.

ఆనం రామ నారాయణరెడ్డి అను నేను అంటూ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ నేత. నలుగురు సీఎం వద్ద ఆరుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న నేతగా రికార్డ్‌కెక్కారు. 1993లో నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో పని చేశారు. 1985లో గెలిచి మరోసారి మంత్రిగా పదవి బాధ్యత లు స్వీకరించారు. అలాగే 1991లో కాంగ్రెస్‌లో చేరి 1999, 2004 రావూరు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2007, 2009లో వైఎస్‌ఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2012లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనూ మినిస్టర్‌గా చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించు కుని ప్రమాణస్వీకారం చేశారు.

చంద్రబాబు మంత్రివర్గంలో మరోనేతకు అవకాశం లభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ యాదవ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

హ్యాట్రిక్ విజయంతో రికార్డ్‌ సృష్టించిన నిమ్మల రామానాయుడు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత రెండుసార్లు విజయ దుందుబి మోగించిన రామానాయుడు మరోసారి పాలకొల్లు నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.

టీడీపీ నేత ఎన్‌ఎండీ ఫరూఖ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ సమయంలో ఫరూఖ్‌ అభిమానులు నినాదాలతో హెరెత్తించారు

అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు మంత్రిగా తొలిసారి అవకాశం దక్కింది. దీంతో మినిస్టర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి కాలేకపోయిన ఆయన మొత్తానికి అదృష్టం కలిసిరావడంతో తొలిసారి చంద్రబాబు కేబినెట్‌లో మినిస్టర్‌ పదవి వరించింది. ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోతుందని, ఆయన ఓడిపోతే టీడీపీ గెలుస్తుందనే సెంటిమెంట్‌ను బ్రేకే చేసి ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించుకున్నారు.

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని వరించిన అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ అబ్దుల్ నజీన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్‌ పొలిటిషీయన్‌ అయిన కొలుసు పార్థసారథి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన పార్థసారథిని అదృష్టం వరించడంతో మరో సారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారులో బాలవీరాంజనేయస్వామి. ఈ మేరకు విజయ వాడలోని కేసర పల్లిలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు వీరాంజనేయస్వామి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్‌ పదవి అందుకున్నారు.

ఇక అద్దంకి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన హనిమిరెడ్డి పై భారీ మెజార్టీతో గెలుపొంది.. చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశాన్ని దక్కించుకున్నారు.

నిడదవోలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన జనసేన నేత కందుల దుర్గేష్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్‌ 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేన కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

టీడీపీ నాయకురాలైన గుమ్మ‌డి సంధ్యారాణి కూడా చంద్రబాబు కేబినేట్‌లో అవాకశం దక్కించుకున్నారు దీంతో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ రాష్ట్ర మంత్రిగా సంధ్యారాణి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక బీసీ జనార్థన్‌రెడ్డి కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ అభ్యర్థిగా కూటమి సహకారంతో బనగానపల్లె నుంచి బరిలో దిగిన ఈయన విజయకేతనం ఎగురవేసి మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో చంద్రబాబుతోపాటు రాష్ట్ర మంత్రిగా జనార్థన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించడంతో టీజీ భరత్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన భరత్‌ వైసీపీని మట్టికరిపించి విజయం సాధించి చంద్ర బాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

   అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే ఎస్.సవిత విజయవాడలోని కేసరపల్లిలో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సవిత కుటుంబం ఆ టీడీపీలోనే కొనసాగుతుండగా 2015 నుంచి టీడీపీలో క్రియా శీల సభ్యురాలిగా సవిత యాక్టివ్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెనుగొండ నియోజ కవర్గం నుంచి పోటీ చేసిన సవిత వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై 33 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకు న్నారు.

వాసంశెట్టి సుభాష్ అను నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ నేత. విజయవాడ లోని కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. రాష్ట్ర మంత్రిగా వాసంశెట్టి సుభాష్ చేత ప్రమాణ స్వీకా రం చేయించారు.

విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించు కుని రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యపై 24 వేలకుపైగా మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పాలిటిక్స్‌లోకి ఎంటర య్యారు.

ఎం.రాంప్రసాద్‌రెడ్డి కూడా మంత్రి పదవి వరించింది. చంద్రబాబు కేబినెట్‌లో అవకాశం దక్కడంతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ రాంప్రసాద్‌రెడ్డితో ప్రమాణం చేయించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్