25.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్రుడి ప్రస్థానం

చాయ్‌వాలా నుంచి దేశ ప్రధానిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోడీ. బాల్యం నుంచి ఆరెస్సెస్ సిద్దాంతాలతో ఆయన ప్రభావి తమయ్యారు. 1987లో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించారు నరేంద్ర మోడీ. ఆ తరువాతికాలంలో గుజరాత్‌ బీజేపీలో ప్రముఖ నేతగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సత్తా చాటా రు. గుజరాత్ మోడల్‌ను అభివృద్ధికి నమూనాగా మలిచారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు మోడీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి. 2014 ఎన్నికల్లో బీజేపీని విజయపథానికి తీసుకెళ్లారు. 2014 లో తొలిసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చాటారు. ఆ తరువాత 2019 లో మరోసారి బీజేపీని అధికారానికి తీసుకువచ్చారు నరేంద్ర మోడీ. తాజా ఎన్నికల్లో కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నారు నరేంద్ర మోడీ.

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీయే అత్యంత ఛరిష్మాగల నాయకుడు. ఇందులో రెండో ముచ్చటే లేదు. జనాకర్షణ విషయంలో ఒకటి నుంచి పది వరకు నరేంద్ర మోడీయే. ఎవరైనా సరే పదకొండో స్థానానికి పోటీ పడాల్సిందే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు ముచ్చటగా మూడోసారి పట్టం కట్టారు. నరేంద్ర మోడీ 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. నరేంద్ర మోడీ స్కూల్ చదువు స్థానికంగానే పూర్తి చేశారు.

నరేంద్ర మోడీ బాల్యం నుంచి ఆరెస్సెస్ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారు. 1970దశకంలో విశ్వ హిందూ పరిషత్తులో నరేంద్ర మోడీ చేరారు. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్మడం ద్వారా జీవితం మొదలెట్టిన నరేంద్ర మోడీ అంతిమంగా దేశ ప్రధాని అయ్యారు. ఈ జీవన ప్రస్థానంలో నరేంద్రుడి జీవితం అనేక ఆటుపోట్లకు గురయ్యింది. అనేక ఎత్తుపల్లాలను ఆయన చూశారు. వీహెచ్‌పీ నుంచి 1987లో భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ ప్రవేశించారు.ఆ తరువాత బీజేపీలో నరేంద్ర మోడీ అంచెలంచెలుగా ఎదిగారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు అలాగే 1992లో మరళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కాశ్మీర్ రథయాత్రకు నరేంద్ర మోడీ ఇన్‌చార్జీగా పనిచే శారు. మెల్లమెల్లగా గుజరాత్ బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా మోడీ ఎదిగారు.

    2001 జనవరిలో గుజరాత్‌లో పెను భూకంపం సంభవించింది. భూ కంపం నేపథ్యంలో సహాయ కార్య క్రమాలు చేపట్ట డంలో కేశూభాయ్‌ పటేల్‌ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కేశూభాయ్‌ పటేల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ అగ్రనాయకత్వం తొలగించింది . ఈ నేపథ్యం లో 2001 అక్టోబరులో నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టింది. గుజరాత్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే నరేంద్ర మోడీ అద్భుత విజయాలు సాధించారు. భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత 2012 ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించింది. నరేంద్ర మోడీ వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు.

గుజరాత్ మోడల్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో తెరమీదకు వచ్చిన పదం ఇది. ఆ తరువాతి కాలంలో గుజరాత్ మోడల్, ఒక అభివృద్ది నమూనాగా దేశమంతా పాపులరైంది. గుజరాత్ మోడల్‌తో రాష్ట్రం పారిశ్రామి కంగా అద్భుత విజయాలు సాధించింది. గుజరాత్ మోడల్‌తో నరేంద్ర మోడీ పేరు దేశమంతా మార్మోగింది. సమర్థుడైన ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత వచ్చిన 2014 లోక్‌సభ ఎన్నికలు నరేంద్ర మోడీ రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పాయి. అప్పటివరకు పదేళ్లపాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో అధికారంలో ఉంది. యూపీఏ సర్కార్‌లో అనేక కుంభకోణాలు జరిగాయి. బొగ్గు కుంభకోణం, కామన్వె ల్త్ కుంభకోణం, టూ జీ కుంభకోణాలు వీటిలో కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబుకింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలకు మారుపేరు అని ప్రజలు అనుకోసాగారు. ఈ నేపథ్యంలో 2014 లోక్‌సభ ఎన్నిల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. దీంతో 2014 మే 26న ప్రధానిగా తొలిసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు.

   ఐదేళ్ల తరువాత 2019లో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన జరిగింది. పుల్వామా సంఘటన లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో 2019నాటి ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా 303 సీట్లు తెచ్చుకుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.ఈ ఐదేళ్ల కాలంలో దేశ ప్రజలు శెహభాష్ అనుకునే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ. ఇందులో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా లేకపోలేదు. దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ వంటి వాటిని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగ పరచిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ బీజేపీకి అధికారం దక్క కుండా చేయడానికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రయత్నించాయి. బీజేపీయేతర పార్టీలన్నీ దాదాపు ఏడాది కిందట పాట్నాలో ఒక వేదిక మీదకు వచ్చాయి. ఈ తరువాత బెంగళూరులో బీజేపీయేతర పార్టీలు మరోసారి సమావేశమయ్యాయి. బెంగళూరు సమావేశాల్లోనే బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. బెంగళూరు నుంచి ముంబైలోనూ ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. ఒకదశలో ఇండియా కూటమిలో 28 భాగస్వామ్య పక్షాలున్నాయి. అయితే ఆ తరువాతి కాలం లో జేడీ యూ అధినేత నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలగారు. ఎన్డీయే కూటమిలోకి ఎంట్రీ ఇచ్చారు. వరుస సమావేశాలతో ఇండియా కూటమిలో జోష్ పెరిగింది. ఒక దశలో ఇండియా కూటమి నుంచి ఎన్డీయే కూటమికి తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించడంతో ఇండియా కూటమిలో విభేదాలు పొడచూపాయి. దీంతో ఇండియా కూటమి రాజకీ యంగా బలహీనమైంది.

   ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు దూరమైంది. ఒక దశలో కాంగ్రెస్‌తో పొత్తు లేదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే ఆ తరువాత తన వైఖరి మార్చుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం ఒంటరిపోరు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇండియా కూటమి నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురైననప్పటికీ, విజయం వైపు దూసుకుపోయింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజే అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్