హైదరాబాద్ ఫిలింనగర్ సమీపంలో డ్రగ్స్ కలకలం రేపింది. షేక్‌పేట్ సమీపంలోని వినాయక్ నగర్‌లో ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ఆండీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని తనిఖీ చేయగా 16 గ్రాములు కొకైన్ పట్టుబడింది. కర్ణాటకలో ఉంటున్న మరో నైజీరియన్ ఒబాసిన్ నుంచి 30 గ్రాముల కొకైన్ కొనుగోలు చేసినట్లు ఆండీ వెల్లడించారు. 14 గ్రాములు గతంలోనే విక్రయించినట్లు చెప్పారు. గ్రాము 5 వేలకు కొనుగులో చేసి నగరంలో గ్రాము 10 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. తన వద్ద కొనుగోలు చేసే ఆదర్శ్, సుమిత్, ఇషాన్, ఎన్‌కే కోసం తాజాగా కొకైన్‌తో సిద్ధంగా ఉన్నానని వెల్లడిం చారు. దీంతో నిందితులపై ఎన్‌డీపీఎస్ యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.


