23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

సప్త నది సంగమేశ్వర పవిత్ర జలాలు కలుషితం

    ప్రాచీన సప్త నది సంగమేశ్వర ఆలయం క్షేత్రమే కాకుండా తీర్థం కూడా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడు నదులు ఒకే చోట సంఘమించే అతి పవిత్రమైన స్థలం సప్త నది సంగమేశ్వరం. ఈ నదులలో పుణ్య స్నానాలు ఆచరించిన శ్రాద్ధ కర్మలు చేపట్టిన వారికి పాప పరిహరణ, గతించిన పితారులకు పర లోకంలో శాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అయితే సప్త నది సంగమేశ్వర కృష్ణ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. నదిలో రసాయన వ్యర్ధాలు వ్యాపించి జలాలు అపవిత్రమయ్యాయి. వీటిని చూసి భక్తులు బెంబేలెత్తడమే కాకుండా పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించేందుకు జంకుతు న్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ప్రమాదకర రసాయనాలు సంగమేశ్వరం, కృష్ణ నది జలాల్లో తేలి ఆడడం చూసిన భక్తులు ఆవేదన చెందుతున్నారు.

   ఆనాడు పరమశివుడు గరళాన్ని తన కంఠంలో భద్రపరుచుకుని లోక కళ్యాణార్థం చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అంతటి ఆది దేవుడైన పరమ శివుడే గరళ ప్రభావానికి సొమ్మసిల్లి పోయా డు. నేడు ఆ పరమశివుడు వేపదారు శివలింగ రూపంలో ప్రతిష్టింపబడ్డ సప్త నది సంగమేశ్వర పవిత్ర జలాలు రసాయన వ్యర్ధాలతో కలిసి ప్రమాదకరంగా మారాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు, నల్లమల సరిహద్దు తీరంలో వెలసిన సంగమేశ్వర ఆలయం చుట్టూ ఉన్న జలాలు ఇంకిపోతున్నాయి. ఈ వేసవిలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశం నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి సప్త నది జలాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి ఈ నది జలాలు పాచి వర్ణంలోకి రంగు మారాయి. తీవ్ర దుర్గంధం ఆలయాల పరిసరాల్లో వ్యాపించింది. భరించలేని స్థితిలో భక్తులు క్షేత్రంలో గడపలేకపోతున్నారు.

కర్నూలు పరిసర ప్రాంతాల్లోని కర్మగారాల నుంచి వెలుబడిన రసాయనాలు తుంగభద్ర నదిలో కలిసి అక్కడి నుంచి కృష్ణా నదిలో వ్యాపించి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయ జలాలను చుట్టుముట్టింది. ఈ కలుషిత జలాలు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రవావం వైపు కదులు తోంది. భక్తులు ఈ కలుషిత జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులకు రసాయనాల వల్ల ఇబ్బందు లు పడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా నదిలో ఏడు రకాల జాతుల చేపలు చనిపోయి ఒడ్డుకు కొట్టు కొస్తున్నాయి. వీటిని తిన్న వలస పక్షులు మృతువాత పడుతున్నాయి. చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న ఈ ప్రాంత జాలర్లకు చిక్కిన చేపలు విషపూరితం కావడంతో పార వేస్తున్నారు.

కర్నూల్‌లోని బడా పారిశ్రామికవేత్తల కర్మగారాల నుంచి విడుదలైన విషపూరిత రసాయనాల వల్ల సంగ మేశ్వరంలో కృష్ణా జలాలు పూర్తిగా కలిసితమై పోతున్నాయి. ఆ జలాల నుంచే తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు మర పడవలపై ప్రయాణించాల్సిన దుస్థితి వచ్చింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని భక్తులు, మత్స్యకారులు ప్రశ్నిస్తు న్నారు. ఇప్పటికైనా యంత్రాంగం కర్మగారాలపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుకుం టున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్