చికిత్స కోసం వస్తే ప్రాణాలు తీశారంటూ వరంగల్‌లో సంరక్షణ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు బాధితులు. ఈ నెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో 45 ఏళ్ల మహిళ వాణి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న వాణి మరణించడంతో ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. అయితే, కిడ్నీ సర్జరీలో భాగంగా కిడ్నీతోపాటు ప్రేగును తీసివేయడంతోనే వాణి తీవ్ర అస్వస్థతకు గురైందని, ఆ తర్వాత వైద్యులు చేతులెత్తేసి హైదరాబాద్‌కు తరలించమన్నారంటూ తెలిపారు బంధు వులు. వైద్యుల తీరుపై నిలదీయడంతో చికిత్స ఖర్చులు భరిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించు కోకుండా వాణి మృతికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వాణి పేరుతో వచ్చిన ఇన్సూరె న్స్ డబ్బులు కూడా నొక్కేశారని మండిపడ్డారు. వాణి మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.