25.4 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణకు సర్వం సిద్ధం

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా చేయాలని కాంగ్రెస్ సర్కార్ సంకల్పించింది. రాష్ట్రంలో తొలి సారి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, తెలంగాణ అవతరణ దినోత్సవ పదేళ్ల పండుగ సంబరాలు అంబ రాన్నంటేల నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర చిహ్నం, రాష్ట్రీయ గేయం మార్చాలని రాష్ట్ర సర్కారు భావించింది. ఎన్నో కసరత్తుల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దీనికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, ఆకస్మికంగా చిహ్నం మార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి, రాజముద్ర ప్రకటన వాయిదా వేసింది. చివరి క్షణాన సర్కారు వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటి..? ఆదిలోనే అంతరాయానికి కారణం ఏమిటి..?

    తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల వేళ, తన మార్క్ చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిం చారు. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం, టీఎస్ ప్లేస్ లో టీజీ విషయాల్లో రేవంత్ రెడ్డి తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ పదేళ్ల పండగ సంబరాల్లో ఇవన్నీ అమలులోకి తీసుకురావాలని రాష్ట్ర సర్కారు భావించింది. తొలిసారి కాంగ్రెస్ సర్కార్ హయాంలో నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలు కావడంతో అన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆర్భాటం గా నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు ఉద్యమ కారులందరికీ అధికారికంగా ఆహ్వానం పంపాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటు లో పాస్ అయ్యేందుకు కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఉద్యమకా రులు, సోనియాగాంధీ పాల్గొన్న వేదిక సాక్షిగా నూతన రాష్ట్రీయ గీతం, నూతన రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించాలని సీఎం భావించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

    తెలంగాణ రాష్ట్రీయ గీతం, తెలంగాణ రాజముద్ర మార్పు విషయాల్లో ప్రతిపక్ష BRS నేతలు, మరి కొందరు ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయజయహే తెలంగాణ గేయాన్ని, తెలంగాణ రచయిత అందెశ్రీ రాశారు. అయితే, ఈ గేయానికి సంగీతాన్ని కీరవాణి సమకూర్చారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సంగీత దర్శకులు లేరా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై సీఎం సైతం వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రీయ గీతానికి సంగీత దర్శకుడి ఎంపిక పూర్తిగా గేయ రచయిత అందెశ్రీ నిర్ణయమేనని, ఇందులో తమ జోక్యం ఏమి లేదని రేవంత్ తెలియజేశారు. దీంతో కొంత ఊరట లభించినట్లయ్యింది. గేయం చివరి దశకు చేరుకుని విడుదలకు సిద్ధమైంది. గేయం వరకు బాగానే ఉన్న చిహ్నం మార్పు రచ్చ రచ్చ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రాంతీయ చిహ్నాలు తొలగించే కుట్రకు రేవంత్ సర్కార్ తలపడిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ కాకతీయ కళా తోరణం. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా చరిత్రకు ఆనవాలుగా ఉన్న చార్మినార్ చిహ్నాలను తొలగించేందుకు హస్తం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారని ఆగ్రహం చెందారు. రాచరికాన్ని ప్రతిబింబిస్తు న్నాయని, అర్థం లేని కారణాలు చూపుతూ ఈ దుశ్చర్యకు పాల్పడ తున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు ఫైరయ్యారు.

   వరంగల్ కాకతీయ కళా తోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగించి వాటి స్థానంలో అమరవీరుల స్థూపం, ధాన్యపు గొలుసులు, సత్యమేవ జయతే, అశోక చక్రం, స్వర్వమతాల చిహ్నం ఉండేలా మార్పు లకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తం అయ్యింది. అటు వరంగల్, ఇటు హైదరాబాద్ ప్రజల్లో ప్రాంతీయ అభి మానం దెబ్బతీసే ప్రయత్నాలకు రేవంత్ తెర లేపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ లో, హైదరాబాద్ చార్మినార్ వద్ద బీ ఆర్ ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ అంశం పై సచివాలయంలో ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం భావించి, సమా వేశం నిర్వహించారు. తాము చేపట్టిన నిరసన ప్రదర్శనల వల్లే ప్రభుత్వం దిగివచ్చిందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, వివాదం పెద్దది కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహా త్మకంగా వ్యవహరించి వాయిదా నిర్ణయం తీసుకున్నారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ఈ మార్పు, చేర్పులకు కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని, ఈ ప్రక్రియకు కనీసం ఏడు రోజులు పట్టే అవకాశం ఉందని, జూన్ 2 లోపున ఇది సాధ్యం కానందువల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

   తెలంగాణ చిహ్నం మార్పు విషయంలో రెండు వందలకు పైగా సూచనలు, సలహాలు వచ్చినట్టు సర్కారు తెలియజేస్తోంది. ఈ సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని చిత్రకారుడు రుద్ర రాజేశ్వం మరింత సమయం తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన చిహ్నాన్ని రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు. ఇదే రూట్ లో సర్కారు వెళ్లాలని ఉన్నట్టు తెలుస్తోంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నిర్వహించే వేడుకల వేదికగా చిహ్నం ఆవిష్కరణ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్