రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడి పాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. దాంతో సజ్జలపై ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.