20.2 C
Hyderabad
Friday, January 16, 2026
spot_img

ఏపీలో ముదురుతున్న పోస్టల్ బ్యాలెట్ వివాదం

    ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం మరింత ముదురుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై వైసీపీ అభ్యంతరం తెలిపింది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ఈ మెయిల్ పంపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సీఈవో కొత్తగా గైడ్‌లైన్స్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఈనెల 25న గైడ్‌లైన్స్‌ ఇచ్చారని వెల్లడిం చారు. ఎన్నికల ప్రక్రియలోని పవిత్రతను కాపాడేందుకు ఈ అంశంపై దృష్టి సారించాలంటూ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ పంపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్