23.2 C
Hyderabad
Saturday, November 9, 2024
spot_img

బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధించేనా ?

      ఎన్నికల ఖర్చు కోసం బీఆర్ఎస్ అధిష్టానం ఫండ్ ఇచ్చింది. ఆ ఫండ్‌ను ఖర్చు చేసి విజయం సాధించాలని ఆదేశించింది.అయినప్పటికీ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ధులు ఖర్చు చేయలేదని పార్టీ లోనే చర్చగా మారింది. అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ హై కమాండ్ ఇచ్చిన ఫండ్‌ను అభ్యర్థులు ఎందుకు ఖర్చు చేయలేదు. పరిస్థితులు అనుకూ లంగా లేవని భావించే ఖర్చుకు వెనుకాడారా..?

   లోక్‌సభ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించాలని ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు బీఫాంతో పాటు 95లక్షల రూపాయల చెక్కులను కూడా అధిష్టానం అందజేసింది. అంతే కాకుండా పార్టీ పరంగా ఆర్ధిక సహాయం అందించారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో అందులో కరీంనగర్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, ఖమ్మంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఫండ్‌ను ఖర్చు చేయగా, మిగిలిన నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పార్టీ ఫండ్‌ను ఎన్నికలకు ఖర్చు చేయలేదని చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతల నుండి బహిరంగంగానే టాక్ వినిపిస్తోంది.

    రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మరోవైపు దేశంలో బీజేపీ అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు ఎన్నికల్లో పార్టీ ఫండ్‌ను కూడా ఖర్చు చేయలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే ఖర్చుకు వెనుకాడినట్లుగా తెలు స్తోంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులకు, క్యాడర్‌కు సైతం కనీస సదుపాయలు కల్పించకపోవ డంతో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. అభ్యర్థుల వ్యవహార శైలితో బీఆర్ఎస్ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయనే ప్రచారం జరుగుతుంది. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ డబుల్ డిజిట్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండటానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ ఓట్లు తమకు బదిలీ అవుతాయనే. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను, సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో ఎలాగైనా కాంగ్రెస్‌ను ఓడించాలనుకున్నా, బీఆర్‌ఎస్ శ్రేణులు తమ ఓట్లను బీజేపీకి వేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులతోనూ ఓట్లు వేయించారనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు జాతీయ స్థాయి అజెండాకు సంబంధిం చిన ఎన్నికలు కావడం. బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచినా పెద్ద ఉపయోగం లేదని భావించిన ఓటర్లు ఆ ఓట్లను బీజేపీకి వేశారనే చర్చ జరుగుతుంది.బీఆర్ఎస్ అధిష్టా నం ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావిస్తున్నా అభ్యర్ధుల తీరు ఎన్ని కల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గులాబీ పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.

     బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్ధుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయించింది. లోక్‌సభ పరిధిలో ఎవరు బలంగా ఉన్నారని వివరాలు సేకరించి ఆ వర్గానికి టికెట్లు ఇచ్చింది. వారికి ఓటర్ల లిస్టు ప్రకారం ప్రణాళికలు రూపొందించింది. అభ్యర్థులు మాత్రం గెలిపించాల్సిన బాధ్యత కూడా పార్టీదే అనే ధోరణి అవలంభించి పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించలేదని సమాచారం. ఇదే విషయంపై పార్టీ అధిష్టానం సైతం సీరియస్ అయింది. నమ్మి వారికి టికెట్లు ఇస్తే పనితీరు బాగాలేదని ఫీడ్ బ్యాక్ సేకరించిన అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం అధిక సీట్లు గెలుస్తామని పైకి చెప్తున్నప్పటికీ లోలోపల మాత్రం తమకు ఆశించిన మేర సీట్లు రావనే అనుకుంటున్నారట. బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన అభ్యర్థు లు సైతం ఫలానా సీట్లలో ఇంత మెజార్టీ వస్తుందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి. పార్టీ అభ్యర్ధులు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లారు. ఎంతమేరకు కష్టపడ్డారు అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ అంటుండగా, మరోవైపు ఓటింగ్ సరళి అభ్యర్థుల పర్ఫామెన్స్‌ను బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో చూడాలి.

Latest Articles

‘ధూం ధాం’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది: చేతన్ కృష్ణ

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్