కరీంనగర్‌లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్‌గా తీసుకు న్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురు భక్తులపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కరీంనగర్‌లో హనుమాన్ దీక్ష స్వాములు శనివారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రశాంత్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు అందులోకి దూరాడు. కత్తితో డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ భక్తులు సదరు యువకుడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడికి, హనుమాన్ భక్తులకు మధ్య మొదలైన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, హనుమాన్ భక్తులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ హను మాన్ భక్తులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా, పోలీసులు వాహనాన్ని అలాగే స్పీడ్‌గా తీసుకె ళ్లారు. ఓ హనుమాన్ భక్తుడు వాహనాన్ని పట్టుకుని అలాగే వేలాడుతూ ఉండిపోయాడు. వాహనం కొద్ది దూరం వెళ్లాక ఆపారు. ఆ తర్వాత వాహనాన్ని అడ్డుకున్న భక్తులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమం లో ఆందోళనకు దిగిన కొందరు భక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. వారికి బీజేపీ నేతలు మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది.