బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కేటీఆర్ తన తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయ్యారని అన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచి లీడర్ అయ్యారని చెప్పారు. రేవంత్ వయసులో పోలిస్తే కేటీఆర్ చిన్న పిల్లాడు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవడం ఖాయం అని జోస్యం చెప్పారు. మేడిగడ్డ మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీ కూలిపోవడం ఖాయం అని చెప్పారు. పదవి పోయోందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రిని పట్టుకుని కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి కి బయపడి కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి సెటైర్లు వేశారు.


