మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించడంలో మొదట్నుంచీ అధికారుల పాత్ర ఉందని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పిన్నెల్లి పరారీ పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తెలిపారు. నిందితులకే పోలీసులు పహారా కాస్తారని మరోసారి నిరూపించారని ఆరోపించారు. ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని విమర్శించారు. ఆయన్ను ఏపీ పోలీసులు అరెస్టు చేయరని అన్నారు. డీజీపీ, పోలీసులు వైసీపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లిని పట్టుకోలేని వారికి చలో మాచర్లను అడ్డుకునే హక్కు ఎక్కడిదని నిలదీశారు.


