ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు అన్ని దారులు వెతుకుతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న అధికారులు, భూములు, భారీ నిర్మాణాలు లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. కరోనా సృష్టించిన కష్టం నుండి గట్టెక్కించా లని, ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. అనుకున్నంతగా ప్రయాణికులు రాకపోవడంతో రియల్, యాడ్ రెవెన్యూ పై సంస్థ సీరియస్‌గా ఫోకస్ చేస్తోంది. టికెట్ రేట్లపై ప్రభుత్వ నిర్ణయం ఫైనల్ అయితే ఆదాయం కొంతమేర పెరగవచ్చు. నష్టాల నుండి గట్టెక్కేందుకు కొంత వాటాను సైతం అమ్మేందుకు మెట్రో ప్లాన్ చేస్తోందన్న మాటలూ వినిపిస్తున్నాయి.