కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నిండకముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో ఐదు గంటలపాటు కరెంట్ పోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శ మని దుయ్యబట్టారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ వరంగల్‌లో గ్రాడ్యుయేట్స్ సన్నాహక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్‌గా మారిందని విమర్శించారు. ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామంటూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రైతు బిడ్డగా చదువుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కావాలో లేదా మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్ కావాలో పట్టభద్రులు తెలుసుకో వాల్సిన సమయం వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.


