తెలంగాణలో మిల్లర్ల అక్రమాలపై సివిల్ సప్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పందించనున్నారు. ఏళ్లు గడుస్తున్నా CMR బియ్యాన్ని అప్పగించని మిల్లర్లపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. మిల్లర్ల అక్రమాల తో వందల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగవేతపై డీఎస్ చౌహాన్ ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు.మరోవైపు మిల్లర్లు చట్టానికి దొరకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ ఆస్తులను ఇతరుల పేర్ల మీద మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం.


