వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదే శాలు జారీ చేసింది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202తోపాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు వెబ్ కెమెరాలో రికార్డయ్యాయి. విచారణలో MLA రామ కృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డీజీపీకి తెలియజేయాలని AP CEO ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి కొట్టడం వెబ్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యేను ఓ మహిళ నిలదీశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఆమెపై దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం లో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
ఈవీఎంల ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు
0
237
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


