తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు. ధిక్కార స్వరాలు. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు కావలసింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
హన్మకొండ జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాకేశ్ రెడ్డి జన్మించారని, బిట్స్ పిలానీలో విద్యా భ్యాసం చేశారని కేటీఆర్ అన్నారు. మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందా రని తెలిపారు. అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయాం శాలు, ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ ఫెడరలిజం, ది డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించినట్లు తెలిపారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్‌గా పేర్కొన్నారు. యువ కుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించేతత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేశ్ రెడ్డి గారిని పట్ట భద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే, పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని కేటీఆర్ ట్వీట్ చేశారు.