హరియాణా నూహ్‌లోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ ప్రైవేట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి పంజాబ్‌లోని జలంధర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. విద్యుదాఘాతం వల్ల బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.


