Free Porn
xbporn
26.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

రణరంగాన్ని తలపిస్తోన్న తాడిపత్రి

తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రం రణరంగాన్ని తలపిస్తోంది. టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య పోలింగ్‌ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సందర్బంగా పట్టణంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రారంభం అయిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టణంలో ఈ రెండు పార్టీల మధ్య దారులు ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. ఈ దాడులతో తాడిపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ రోజంతా గడిపారు.

తాడిపత్రి పట్టణంలో వైసిపి కార్యకర్తలు పట్టణంలో ఉన్న టిడిపి నాయకుడు సూర్యముని ఇంటిపై నిన్న ఉదయం దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టిడిపి నాయకులు ప్రతిదాడిగా రాళ్లురువ్వారు. ఈ నేపథ్యంలో ఇరువు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టిడిపి, వైసిపి నాయకులు రాళ్లు రువ్వుకునే క్రమంలో అదుపు చేసేందుకు వెళ్లిన తాడిపత్రి పట్టణ సిఐ మురళీకష్ణ తలకు రాయి తగిలి గాయం అయ్యింది. వైసిపి నాయకులు సూర్యముని ఇంటిపై చేసిన దాడి విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట టిడిపి మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

పెద్దారెడ్డి ఇంటి వద్దకు టిడిపి మద్దతుదారులు వెళ్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ప్రత్యేక బలగాలను తాడిపత్రికి రప్పించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినా టిడిపి మద్దతుదారులు ఏమాత్రం లెక్కచేయకుండా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు వెళ్లారు. ఈ సమయంలో మార్గమధ్యంలో వైసిపి నాయకులు కూడా వందలాదిమంది కార్యకర్తలతో ఎదురుగా వచ్చారు. పట్టణంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీ క్రీడా మైదానంలో ఇరు గ్రూపులు మరోసారి ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు మూడు గంటలసేపు రాళ్లు విసురుకోవడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్‌ నెలకొంది. ఇందులో ఓ వైసిపి కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వైసిపి కార్యకర్తను ఆసుపత్రికి తరలించాగా పరిస్థితి విషమంగా అన్నట్లు వైద్యులు తెలిపారు.

వైసిపి, టిడిపి మద్దతుదారులు దాడులు, ప్రతిదాడులను నిలువరిచేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. పోలీసులు కేంద్ర బలగాల సహాయంతో లాఠీఛార్జీ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తాడిపత్రి ప్రజలు భయాందోళన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎప్పుడు ఏ ఘటన చోటు చేసుకుంటోందన్న ఆందోళన తాడిపత్రి ప్రజల్లో కన్పిస్తోంది.

Latest Articles

విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్

పరువునష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్‌ హాజరయ్యారు. ఓ మీడియా సంస్థపై పరువునష్టం దావా వేశారు లోకేష్. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్