ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన ఏది చెప్పినా ఎన్నికల కోసమే అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలోని నందుర్ బార్ లో కాంగ్రెస్ న్యాయ్ సంకల్ప్ సభలో ప్రియాంక ప్రసంగించారు. ప్రధాని తాను అవినీతిపై ఒంటరిపోరాటం సాగిస్తున్నానని ప్రచారం సభలో చెబు తున్నారని, దీనిలో ఔచిత్యం ఉందా అని ప్రియాంక ప్రశ్నించారు. మోదీకి ప్రధానిగా అన్ని వనరులు ఉన్నాయని, ప్రపంచంలోని నాయకులంతా ఆయన వెంటే ఉన్నారని ఆయన ఎలా ఒంటరి అవుతార న్నారు ప్రియాంక. ఎన్నికల సభల్లో ప్రధాని చిన్న పిల్లాడిలా తనను ప్రత్యర్థులు దూషించారని కన్నీరు పెడతారని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ నుంచి దృఢ సంకల్పం, ధైర్యసాహసాలు నేర్చుకో వాలని హితవు చెప్పారు. ఎన్నో త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ వంటి గొప్పమహిళను దేశద్రోహి అని అవమా నించే నీచానికి పాల్పడతారని.. ప్రియాంక గాంధీ విమర్శించారు.


