27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

‘తెలుగోడు’ పేరుతో చంద్రబాబు బయోపిక్ రిలీజ్

తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు చరిత్ర. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కింది.

నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశారు. గురువారం ఉదయం విడుదలైన ఈ సినిమా సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.

చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని… తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా” అని చెప్పారు.

అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ కాన్సెప్ట్ అని డాక్టర్ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా.  కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది” అని చెప్పారు.

చంద్రబాబు పాత్రలో వినోద్ నటించిన ‘తెలుగోడు’ చిత్రానికి ఛాయాగ్రహణం: మల్లిక్ చంద్ర, సంగీతం: రాజేష్ రాజ్, కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – ప్రొడ్యూసర్ – డైరెక్టర్: డాక్టర్ వెంకీ మేడసాని.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్