ములుగు జిల్లా వెంకటాపురం మండలం కోయ బెస్తగూడెం గ్రామ సమీపంలోని చెరువు మట్టిని అర్ధరాత్రి రైతుల పేర్లు చెప్పి అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా చెరువు నుంచి మట్టిని తరలిస్తుండడంతో చెరువులో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. మట్టి మాఫియా అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు, మట్టి తొడి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీంతో చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తూ డబ్బుచే సుకుంటున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇరిగే షన్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తరలిస్తు న్నారనే అరోపణలు ఉన్నాయి. చెరువులో నీరు ఇంకిపోవడంతో అక్రమార్కులకు పని మరింత సులు వైంది. ఇప్పటికైనా చెరువుల్లో మట్టిని తరలించకుండా ఆపాలని రైతులు అధికారులను కోరుతు న్నారు.


