ఎండలకు తాళలేక అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. పలు చోట్ల వర్షాలు పడతా యని తెలిపింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరి గింది. భానుడు భగభగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతు న్నారు. చాలా జిల్లాల్లో 46 డిగ్రిలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్రమైన వేడి, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజ లకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మంచి ర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాద్రాది, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబలో వర్షాలు కురుస్తాయని వెల్లడిం చారు. ఇన్నాళ్లూ రికార్డు స్థాయి ఎండలతో ఉడికిపోయిన నల్గొండ, సూర్యాపేట, ములుగు, జనగామ జిల్లాలు ఆదివారం వర్షపు చినుకులతో కాస్త చల్లబడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వాజేడు, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలు, జనగామ జిల్లాకేంద్రం, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలాల్లో మామిడికాయలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిసిపో యాయి. మరోవైపు ఏపీలో కూడా ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు చెప్పారు.


