మతం పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాముడు అందరి వాడని చెప్పారు. సిరిసిల్లలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బిజెపి పుట్టక ముందు నుండే ఉండేవ న్నారు. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. బీజేపీ ఏం చేసిందని ఓట్లు అడుగుతు న్నారని ప్రశ్నించారు. వారికి ఎందుకు ఓటు వేయాలని అడిగారు. మోడీ ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేసారని కేటీఆర్ మండిపడ్డారు. ఆప్ కీ బార్ 420 అంటు న్నారని, అక్కరికి రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మనకు ఘోరమైన ప్రధాని ఉన్నారని విమర్శించారు.


