పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బీజేపీ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ లోక్ సభ నియోజ కవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరు తరలి రానున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు.


