రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు పాలన మళ్లీ రావాలన్నారు సినీ హీరో నారా రోహిత్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పలాస నియోజకవర్గాల్లో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజక వర్గంలో ఉమ్మడి కూటమి బిజేపి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే చంద్రబాబుకు మాత్రమే ఓటు వేయాలని, విజన్ ఉన్న నాయకులకు మాత్రమే మద్దతుగా నిలవాలని కోరారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రగతికి అండగా నిలవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


